AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్య విద్యార్థికి కరోనా వైరస్ పాజిటివ్, నిపుణుల వివరణ

ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ధి కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్య విద్యార్థికి కరోనా వైరస్ పాజిటివ్,  నిపుణుల వివరణ
Covid-19 Vaccine
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 01, 2021 | 12:27 PM

Share

ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ధి కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యాడు. ప్రస్తుతం ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదట ఇతడ్ని  సియోన్ హాస్పిటల్ లో చేర్చారు. ఆ తరువాత సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి మార్చారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా  ప్రతివ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధిలోశరీరంలో రోగనిరోధక శక్తి   పెరుగుతుందని చెప్పలేమని బాలకృష్ణ అడ్ సుల్ అనే డాక్టర్ చెప్పారు. 21 ఏళ్ళ ఈ వైద్య విద్యార్ధిని గత శనివారం ఆసుపత్రిలో చేర్చారు. రెండో డోసు తీసుకున్న  వెంటనే ఇతనికి స్వల్పంగా  కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకింది. అయితే ఇతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ బాలకృష్ణ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత రోగ నిరోధక శక్తి పెరిగే సూచనలున్నాయని ఆయన అన్నారు.

ఈ విద్యార్ధి ఉంటున్న హాస్టల్లో ఇతని స్నేహితులనందరినీ క్వారంటైన్ కి తరలించారు. తమకు త్వరలో పరీక్షలు జరగనున్నాయని. క్వారంటైన్ లో ఎన్ని రోజులు ఉండాలో తెలియడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు. అటు-వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది హెల్త్ వర్కర్లు కూడా అస్వస్థత పాలైన కేసులు ఉన్నాయని సియోన్ ఆకుపత్రి డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. టీకామందు తీసుకున్న తరువాత కూడా కోవిడ్ సేఫ్టీ ప్రొటొకాల్స్ ని తప్పనిసరిగా పాటించాలని, వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండడం తగదని ఆయన అన్నారు . ఇప్పటికీ తాము ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నామన్నారు.

ముంబైలో తాజాగా 1051 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,915 కి చేరింది. ఇప్పటికే  మహారాష్ట్ర కోవిడ్ కేసులతో సతమతమవుతోంది ఇక దేశంలో కొత్తగా 15,510 కేసులు నమోదు కాగా నిన్న ఒక్క రోజే 106 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర తో బాటు కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు  కూడా ఈ ఇన్ఫెక్షన్ ని ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :

మార్స్ పై నాసా రోవర్ ని కంట్రోల్ చేస్తున్నదెవరు ? ఆశ్చర్యం !ఇంకెవరు? ప్రవాస భారతీయుడే !

మొదటి సారి కోవిడ్ వాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ..నేటి నుండి రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్