TS Covid 19 Cases: తెలంగాణలో పెరిగిన రికవరీ రేటు.. జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు..
Telangana Covid 19 Cases: తెలంగాణలో కోవిడ్ (Telangana Covid 19 Cases) వ్యాప్తి పెరుగుతోంది. తెలంగాణలో వస్తున్న కేసుల కంటే రికవరీ రేటు అద్భుతంగా ఉంది. ఇక తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 55,883 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,047 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,057కి చేరింది. కొత్తగా 24 గంటల […]
Telangana Covid 19 Cases: తెలంగాణలో కోవిడ్ (Telangana Covid 19 Cases) వ్యాప్తి పెరుగుతోంది. తెలంగాణలో వస్తున్న కేసుల కంటే రికవరీ రేటు అద్భుతంగా ఉంది. ఇక తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 55,883 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,047 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,057కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,013 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,83,104కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,048 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,06,29,520 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1174,రంగారెడ్డి140,మేడ్చెల్ 175 కేసులు నమోదయ్యాయి.
అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పెంచడంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..