Corona Lock Down: నిన్న బేగం బజార్ వ్యాపారస్తులు.. నేడు ఆటో మొబైల్ యూనియన్.. కరోనా నేపథ్యంలో రేపటి నుంచి..
Corona Lock Down: కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న అలజడి మాములగా లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కోవిడ్ 19 కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు..
Corona Lock Down: కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న అలజడి మాములగా లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కోవిడ్ 19 కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ను కూడా విధిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు ఆంక్షలు విధించని చోట ప్రజలే స్వచ్ఛందంగా సెల్ఫ్ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కేసులు బాగా పెరుగుండడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఒకటైన బేగం బజార్ వ్యాపారులు సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ఆటోమొబైల్ యూనియన్ కూడా వచ్చి చేరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వీయ నియంత్రణలో భాగంగా తెలంగాణలోని అన్ని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్(టూ, త్రీ వీలర్) దుకాణాలు సాయంత్రం 6:30 గంటలకే మూసివేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వీటిని అందరూ పాటించాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరి కరోనా విజృంభణ నేపథ్యలో ఇతర సంస్థలు కూడా ఇదే దారిలో అడుగులు వేస్తాయో చూడాలి.
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పొందే అవకాశం.. ఎలాగో తెలుసుకోండి..?