మా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయం.. నిర్మాత క్లారిటీ

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టిస్తున్న 'జ‌గమే తంత్రం' మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. అప్పుడే క‌రోనా లాక్‌డౌన్ విధించ‌బ‌డింది. దీంతో అప్ప‌టి నుంచి ఈ సినిమా విడుద‌ల కాలేదు. అయితే ఇప్పుడు సూర్య‌, నానిల సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతూండ‌టంతో..

  • Tv9 Telugu
  • Publish Date - 8:42 am, Thu, 27 August 20
మా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయం.. నిర్మాత క్లారిటీ

లాక్‌డౌన్ కార‌ణంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుద‌ల నిలిచిపోయాయి. దీంతో సినిమాల‌ను రిలీజ్ చేయ‌కుండా అలా వ‌దిలేయ‌డం కంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నేరుగా విడుద‌ల చేయ‌డం బెట‌ర్ అని భావిస్తున్నారు ద‌ర్మ‌క నిర్మాత‌లు. థియేట‌ర్ యాజ‌మాన్యాలు అభ్యంత‌రాలు చెబుతున్నా.. ముఖ్యంగా చిన్న నిర్మాత‌లు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలకు రంగం సిద్ధ చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే నాని, సుధీర్ బాబు వి, సూర్య ఆకాశం నీ హ‌ద్దురా చిత్రాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అసిదే విధంగా ఇప్పుడు మ‌రో పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంద‌ని ప‌లువార్త‌లు వ‌స్తున్నాయి.

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టిస్తున్న ‘జ‌గమే తంత్రం’ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. అప్పుడే క‌రోనా లాక్‌డౌన్ విధించ‌బ‌డింది. దీంతో అప్ప‌టి నుంచి ఈ సినిమా విడుద‌ల కాలేదు. అయితే ఇప్పుడు సూర్య‌, నానిల సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతూండ‌టంతో.. ధ‌నుష్ మూవీ కూడా ఓటీటీలో విడుద‌ల కానుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ విడుద‌ల‌పై నిర్మాత వై నాట్ స్టూడియోస్ అధినేత స్ప‌ష్ట‌త ఇచ్చారు. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ‘ధ‌నుష్ మూవీ జ‌గ‌మే తంత్రం చిత్రాన్ని మీతో పాటు నేను కూడా బిగ్ స్క్రీన్‌పై చూడ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నాము’ అని చెప్ప‌క‌నే క్లారిటీ ఇచ్చారు నిర్మాత‌. దీంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతుందని స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

Read More:

నేడు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచ‌న‌

వ‌ర‌ల్డ్ వైడ్ కోవిడ్‌ అప్‌డేట్స్.. 2.43కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా స్వైర విహారం