నేడు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు..

బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వ్యాపించి ఉంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దీంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మంచిర్యాల జిల్లా ర్యాలీ గ్రామంలో అత్యధికంగా 6.7 సెంటీ మీటర్ల వర్షంపాతం నమోదైనట్లు పేర్కొంది వాతావరణ శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెండు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read More:
వరల్డ్ వైడ్ కోవిడ్ అప్‌డేట్స్.. 2.43కోట్లకి చేరిన పాజిటివ్ కేసులు