తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం
ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,830 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటి వ్ కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 92,208 కాగా, 2,86,720 మంది కరోనా నుంచి కోలుకుని..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో నమోదవుతున్నాయి. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా వైరస్ బారిన పడుతూనే ఉంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక మరణిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,830 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటి వ్ కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 92,208 కాగా, 2,86,720 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 3541కి చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటగా.. అత్యధికంగా తూర్పుగోదావరి(53,567)లో నమోదయ్యాయి. అటు గడిచిన 24 గంటల్లో 8,473 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 81 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 34,18,690 సాంపిల్స్ పరీక్షించారు.
తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 25,685 యాక్టివ్ కేసులు ఉండగా.. 85,223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1,060 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 780కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 61,040 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 10,82,094కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 95, జీహెచ్ఎంసీ 475, జగిత్యాల 52, జనగాం 20, జయశంకర్ భూపాలపల్లి 37, గద్వాల్ 37, కామారెడ్డి 76, కరీంనగర్ 127, ఖమ్మం 161, ఆసిఫాబాద్ 11, మహబూబ్ నగర్ 56, మహబూబాబాద్ 60, మంచిర్యాల 103, మెదక్ 40, మేడ్చల్ 204, ములుగు 26, నాగర్ కర్నూల్ 38, నల్గొండ 190, నారాయణపేట 14, నిర్మల్ 41, నిజామాబాద్ 136, పెద్దపల్లి 85, రాజన్న సిరిసిల్ల 69, రంగారెడ్డి 247, సంగారెడ్డి 61, సిద్ధిపేట 88, సూర్యాపేట 67, వికారాబాద్ 21, వనపర్తి 46, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 139, యదాద్రి భోనగిరిలో 44 కేసులు నమోదయ్యాయి.