మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయండి
వేసవిలో ఎండ ప్రభావంతో చర్మం పొడిబారటం, తడిగా మారటం వంటి సమస్యలు సాధారణం. అలాంటి పరిస్థితుల్లో సహజమైన చర్మ సంరక్షణకు కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెకు కొన్ని చిట్కాలు కలిపి వాడితే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

వేసవికాలంలో ఎండ వలన చర్మంపై తడిగా ఉండటం, పొడిబారటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి సమయంలో సహజమైన ఆయిల్ అయిన కొబ్బరినూనె చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి తేమనిస్తూ చల్లదనం కలిగించేలా పనిచేస్తుంది. అయితే కొబ్బరినూనెలో కొన్ని ఇంటి చిట్కాలు కలిపి రాసినప్పుడు, చర్మం మరింత ఆరోగ్యంగా మారుతుంది.
కొబ్బరినూనెలో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి మృదువుగా మసాజ్ చేయాలి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పాడుకావకుండా కాపాడుతాయి. ఇది చర్మానికి సమతుల్య తేమనిస్తూ.. యవ్వనాన్ని నిలబెట్టేందుకు సహాయపడుతుంది.
కొబ్బరినూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖంపై రాసుకోవచ్చు. ఇది టాన్ తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. కానీ ఇది వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.. ఎందుకంటే నిమ్మరసం కొన్ని చర్మాలకు తీవ్రత కలిగించవచ్చు.
కొబ్బరినూనెలో కొద్దిగా గంధం పొడి కలిపి మసాజ్ చేయడం ద్వారా చర్మానికి చల్లదనంతో పాటు ఫ్రెష్‌నెస్ కూడా వస్తుంది. వేసవిలో ఎండదెబ్బకు చర్మం దెబ్బతిన్నప్పుడు ఇది ఉపశమనం కలిగిస్తుంది.
చిటికెడు పసుపును కొబ్బరినూనెలో కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్యను నియంత్రించవచ్చు. పసుపులోని బాక్టీరియా నిరోధక గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీని వల్ల ముఖం తేలికగా మెరిసేలా మారుతుంది.
ఈ చిట్కాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. చర్మంపై ఏదైనా ప్రతికూల స్పందన కనిపిస్తే.. వెంటనే నిపుణులైన డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ప్రతి ఒక్కరికి చర్మం భిన్నంగా స్పందించే అవకాశం ఉంది.
