Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lightning Strikes: అద్భుతం.. డ్రోన్‌తో మేఘాల్లో మెరుపులు.. ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు

జపాన్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఎన్‌టీటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్‌ను ఉపయోగించి మెరుపులను సృష్టించి, వాటిని నియంత్రించడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా సహజసిద్ధంగా మెరుపు ఏర్పడే పరిస్థితుల్లో డ్రోన్‌లను మేఘాల్లోకి పంపి విద్యుత్ క్షేత్ర ఆధారిత మెరుపును సృష్టిస్తారు. అదే సమయంలో ఏర్పడ్డ విద్యుత్తును సురక్షిత మార్గంలో భూమ్మీదకు చేర్చి ఇతర అవసరాలకు వినియోగిస్తారు.

Lightning Strikes: అద్భుతం.. డ్రోన్‌తో మేఘాల్లో మెరుపులు.. ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు
Lightning Strike
Follow us
Mahatma Kodiyar

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 30, 2025 | 10:36 AM

వర్షం పడే సమయంలో వచ్చే ఉరుములు, మెరుపులు.. వాటితో పాటే వచ్చే పిడుగులు కూడా ఓ రకమైన ప్రకృతి విపత్తే. ఏటా ప్రపంచవ్యాప్తంగా 24 వేల మంది కేవలం పిడుగుపాటు కారణంగా చనిపోతున్నారని ఓ అంచనా. ఒక్క భూకంపాలు మినహా భూమ్మీద సంభవించే తుఫాన్లు, వడగాలులు, టోర్నడోల వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకునే పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలను కూడా వాతావరణ శాఖ ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. కానీ మెరుపుల ద్వారా ఏర్పడే పిడుగుపాటు నుంచి రక్షించే పరిజ్ఞానం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా అభివృద్ధి చెందలేదు. “పిడుగుపాటు నుంచి మానవాళిని ఎందుకు రక్షించలేం?” అనే ఆలోచన జపాన్ శాస్త్రవేత్తలకు తట్టింది. అంతేకాదు.. పిడుగు అంటే అత్యంత హైవోల్టేజితో కూడుకున్న విద్యుత్ శక్తేనన్న విషయం అందరికీ తెలుసు. మరి ఆ విద్యుత్తును దారిమళ్లించి వినియోగించుకుంటే జీవరాశుల ప్రాణాలు కాపాడ్డంతో పాటు ప్రకృతి సృష్టించే విద్యుత్తును కూడా ఒడిసిపట్టుకున్నట్టు అవుతుంది. ఈ ఆలోచన తట్టిందే తడవుగా అనేక పరిశోధనలు చేసి.. చివరకు విజయం సాధించారు జపాన్ శాస్త్రవేత్తలు.

విద్యుత్ రుణావేశం (నెగెటివ్ ఛార్జ్), ధనావేశం (పాజిటివ్ చార్జ్) రూపంలో ఉంటుందన్న విషయం కూడా తెలిసిందే. ఈ రెండూ కలిస్తే స్పార్క్ (మెరుపు) సంభవిస్తుంది. మేఘాల్లో కింది భాగం నెగెటివ్ ఛార్జిని కలిగి ఉంటే.. పై భాగం పాజిటివ్ ఛార్జ్‌ను కలిగి ఉంటుంది. మేఘాల కదలికలతో పాటు ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొట్టినప్పుడు ఈ విద్యుత్తు మెరుపును సృష్టిస్తాయి. ఈ మెరుపు భూమి మీదకు చేరుకుంటే దాన్నే పిడుగు అంటాం. ఆ పిడుగుపాటును నియంత్రించాలి అంటే మేఘాల్లో మనిషి మెరుపును సృష్టిస్తే.. పిడుగును నియంత్రించవచ్చు. జపాన్ శాస్త్రవేత్తలు సరిగ్గా ఆ పనే చేశారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఎన్‌టీటీ కార్పొరేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్‌ను ఉపయోగించి మెరుపులను సృష్టించి, వాటిని నియంత్రించడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా సహజసిద్ధంగా మెరుపు ఏర్పడే పరిస్థితుల్లో డ్రోన్‌లను మేఘాల్లోకి పంపి విద్యుత్ క్షేత్ర ఆధారిత మెరుపును సృష్టిస్తారు. అదే సమయంలో ఏర్పడ్డ విద్యుత్తును సురక్షిత మార్గంలో భూమ్మీదకు చేర్చి ఇతర అవసరాలకు వినియోగిస్తారు.

ఈ ఆవిష్కరణ మెరుపుల్లో ఇంకా అంతుచిక్కని రహస్యాలను అన్వేషించడంలో సహాయపడనుంది. అంతేకాదు, భూమ్మీద జనావాసాల్లో ప్రజలను మెరుపు సంబంధిత నష్టాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనుంది. మెరుపులు మానవ సమాజానికి అత్యంత విధ్వంసకరమైన సహజ విపత్తులలో ఒకటిగా మారాయి. ఎన్‌టీటీ గ్రూప్ ఇప్పటివరకు సమాచార సాంకేతిక సౌకర్యాలతో సహా కీలకమైన సౌకర్యాల కోసం వివిధ మెరుపు రక్షణ చర్యలను అమలు చేసింది. అయినప్పటికీ మెరుపు సంబంధిత నష్టాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా కొనసాగుతున్నాయి. జీవరాశుల ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం, ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేవలం జపాన్‌లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి సంవత్సరం మెరుపు వల్ల సుమారు 1000 నుంచి 2000 బిలియన్ యెన్‌ల నష్టం సంభవిస్తుందని అంచనా.

ఈ నేపథ్యంలో, ఎన్‌టీటీ తమ సుదీర్ఘకాల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మెరుపుల నుంచి సమాచార సాంకేతిక పరికరాలను రక్షించే సాంకేతికతను మరింత అభివృద్ధి చేసింది. మెరుపులు, పిడుగులను పూర్తిగా నివారించే లక్ష్యంతో పనిచేస్తోంది. సాంప్రదాయకంగా మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ కోసం వైర్ రాడ్‌లను ఏర్పాటు చేస్తారు. కానీ వాటి రక్షణ పరిధి పరిమితం. గాలి టర్బైన్‌ల, లేదా బహిరంగ ఈవెంట్ స్థలాల్లో వీటిని స్థాపించడం సాధ్యం కాదు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఎన్‌టీటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి “డ్రోన్ ద్వారా మెరుపు సృష్టి” అనే కొత్త విధానాన్ని అన్వేషిస్తోంది. ఈ పద్ధతిలో తుఫాను మేఘాల క్రింద ఉత్తమ స్థానాల్లో డ్రోన్‌లను ఎగరవేసి, మెరుపులను సృష్టించి, వాటిని గ్రహించి, భూమిపైకి సురక్షితంగా దారి మళ్లించడం జరుగుతుంది.

2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు, షిమానే ప్రిఫెక్చర్‌లోని హమాదా నగరంలోని 900 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతంలో ఈ డ్రోన్ ద్వారా మెరుపు సృష్టి ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో ఫీల్డ్‌మిల్ అనే పరికరాన్ని ఉపయోగించి భూమి విద్యుత్ క్షేత్రాన్ని గమనించారు. మేఘాలు సమీపించడంతో విద్యుత్ క్షేత్ర బలం పెరిగిన సమయంలో, ప్రత్యేక మెరుపు నిరోధక కేజ్‌తో అమర్చిన డ్రోన్‌ను ఎగరవేసి మెరుపును సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగం విజయవంతంగా డ్రోన్‌కు మెరుపు తాకినప్పటికీ అది ఎటువంటి లోపం లేదా దెబ్బతినకుండా పనిచేసింది. దీని ద్వారా డ్రోన్ యొక్క మెరుపు నిరోధక సామర్థ్యం నిరూపితమైంది.

ఎన్‌టీటీ ఈ ఆవిష్కరణ రెండు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. అవి మానవాళితో పాటు జీవరాశిని పిడుగుల నుంచి రక్షించడం, అదే సమయంలో మెరుపు శక్తిని సంగ్రహించి ఉపయోగించడం. ఈ డ్రోన్‌లు మెరుపు సంభవించే స్థానాలను అత్యంత ఖచ్చితంగా అంచనా వేసి, ప్రకృతి కంటే ముందే మెరుపులను సృష్టించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు మళ్లించగలవు. భవిష్యత్తులో ఎన్‌టీటీ మెరుపు శక్తిని నిల్వ చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనుంది. దీని ద్వారా మెరుపులు, పిడుగుల శక్తిని ఒక ఇంధన వనరుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే సోలార్, విండ్ ఎనర్జీ మాదిరిగా ఈ మెరుపుల నుంచి జనించే విద్యుత్తును కూడా వినియోగించే ఆస్కారం ఉంది.

ఈ విజయం గురించి ఎన్‌టీటీ ప్రతినిధి మాట్లాడుతూ “మా ఈ ఆవిష్కరణ సమాజానికి సుస్థిర భవిష్యత్తును నిర్మించడంలో ముందడుగు. మెరుపు సంబంధిత నష్టాలను తగ్గించడంతో పాటు, ఆ ఎనర్జీని సంగ్రహించడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని తెలిపారు. ఈ సాంకేతికత సక్సెస్ రేటును మరింత పెంచేందుకు, ఎన్‌టీటీ అత్యధిక ఖచ్చితత్వంతో మెరుపు సంభవించే ప్రదేశాలను అంచనా వేయడం, మెరుపు సంక్లిష్ట మెకానిజమ్‌లపై పరిశోధనలను కొనసాగిస్తుంది.

ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సమాజంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే, మెరుపు నష్టాల నివారణ, స్థిరమైన ఇంధన వనరుల ఉత్పత్తి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉంది.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది