Covid-19 కరోనా వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలంటూ ఆదేశం..
Supreme Court on Vaccination Policy: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, విధానం అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఉచిత వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ల
Supreme Court on Vaccination Policy: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, విధానం అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఉచిత వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ల కొనుగోళ్లపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తూ.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి నగదు వసూలు చేయడం ఎంతవరకూ సమంజసమని కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఈ వయస్సువారే అధికంగా ఉన్నారని ధర్మాసనం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ విధానం విషయాన్ని సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్ అమలులో చాలా లోపాలున్నాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది.
దీంతోపాటు సుప్రీంకోర్టు కోవిడ్-19 వ్యాక్సిన్ల కొనుగోళ్లపై కూడా కేంద్రానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి సూచించింది. టీకాలు పూర్తయిన జనాభా శాతం.. సింగిల్, డబుల్ డోసుల డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని కూడా వెల్లడించాలని కేంద్రానికి స్పష్టం చేసింది. డిసెంబరు 31 నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలాఉంటే.. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరగగా.. మొత్తం 3,35,102 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: