బ్రేకింగ్.. ‘సుప్రీం’, ఢిల్లీ హైకోర్టులకూ ‘కరోనా సెగ’.. అత్యవసర కేసులే విచారణ

కరోనా భయంతో న్యాయస్థానాలు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ నెల 16 నుంచి అత్యవసర కేసుల విచారణనే చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లాయర్లు తప్ప మరెవరినీ కోర్టు గదుల్లోకి అనుమతించరాదని కూడా నిర్ణయించారు.

బ్రేకింగ్.. 'సుప్రీం', ఢిల్లీ హైకోర్టులకూ 'కరోనా సెగ'.. అత్యవసర కేసులే విచారణ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 6:24 PM

కరోనా భయంతో న్యాయస్థానాలు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ నెల 16 నుంచి అత్యవసర కేసుల విచారణనే చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లాయర్లు తప్ప మరెవరినీ కోర్టు గదుల్లోకి అనుమతించరాదని కూడా నిర్ణయించారు. అలాగే.. 16 నుంచి 14 బెంచ్ ల బదులు ఆరు బెంచ్ లు మాత్రమే పని చేస్తాయి. అంటే ఈ ధర్మాసనాల సంఖ్యను కూడా కుదించారు. కోవిడ్-19  ని గ్లోబల్ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రకటించడంతో జనాలు పెద్ద సంఖ్యలో చేరకుండా చూడాలని ఈ నెల 5 నే ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీంతో ఈ నెల 12, 13 తేదీల్లో చీఫ్ జస్టిస్ బాబ్డే నివాసంలో జరిగిన సమావేశాల్లో ఈ సలహాను పాటించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు.  సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం తెలిసిన వెంటనే ఢిల్లీ హైకోర్టు కూడా అత్యవసరంగా ‘భేటీ’ అయి.. ఈ నెల 16 నుంచి కేవలం ఎమర్జెన్సీ కేసుల విచారణనే చేపట్టాలని తీర్మానించింది. జిల్లా కోర్టుల్లో లిటిగెంట్ల ఎంట్రీని రెగ్యులేట్ చేయాలని కోర్టు అన్ని కోర్టులకు సూచించింది.  సాక్ష్యాల రికార్డింగ్ ని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నిర్వహించాలని కూడా నిర్ణయించారు.