మరో ప్రముఖ నటి, ఎంపీకి కరోనా పాజిటివ్..హోం ఐసోలేషన్

కరోనా వైరస్ తనకంతా సమానమే అంటోంది. సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు ఎవ్వరినీ వదలటం లేదు. దొరికిన వారిని దొరికినట్లుగా అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ..

మరో ప్రముఖ నటి, ఎంపీకి కరోనా పాజిటివ్..హోం ఐసోలేషన్
Follow us

|

Updated on: Jul 06, 2020 | 7:40 PM

కరోనా వైరస్ తనకంతా సమానమే అంటోంది. సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు ఎవ్వరినీ వదలటం లేదు. దొరికిన వారిని దొరికినట్లుగా అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా వైరస్ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా నేపథ్యంలో ఎంపీగా ఉన్న సుమలత తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఇటీవల ఆమె సందర్శించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఆమెకు వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా.. అందులో కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆమె డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని సుమలత ధీమా వ్యక్తం చేశారు.

సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి..పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు భరోసానిస్తూ..పలు ప్రాంతాల్లో పర్యటించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.