COVID 19: ఆల్కహాల్, క్లోరిన్‌తో కరోనా కొత్త వేరియంట్ నశిస్తుందా.? ఇందులో నిజమెంత..!
కొన్ని రోజులుగా కరోనాకు సంబంధించిన వార్తలు పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేవు. దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి తర్వాత శాంతించింది. అయితే తాజాగా మరోసారి చైనాలో వెలుగు చూసిన బీఎఫ్7 వేరియంట్‌తో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. చైనాలో రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, మరణాలతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో వాట్సాప్ యూనివర్సిటీలో..
కొన్ని రోజులుగా కరోనాకు సంబంధించిన వార్తలు పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేవు. దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి తర్వాత శాంతించింది. అయితే తాజాగా మరోసారి చైనాలో వెలుగు చూసిన బీఎఫ్7 వేరియంట్‌తో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. చైనాలో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో వాట్సాప్ యూనివర్సిటీలో మరోసారి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కరోనాకు చిట్కాల పేరుతో ఫేక్ న్యూస్ తెగ ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వార్తల్లో ఒకటి శరీరంపై లేదా దుస్తులపై ఆల్కహాల్ కానీ క్లోరీన్‌ను కానీ స్ప్రే చేసుకుంటే కరోనా కొత్త వేరియంట్ చనిపోతుంది.
నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్త పూర్తిగా నిరాధారణమైందని వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ రసాయనాలు కరోనాపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, శరీరంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయని తేలింది. ఆల్కహాల్ క్లోరీన్ వంటివి ఫ్లోర్‌ను క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప కరోనాపై పనిచేయవు. అంతేకాకుండా వీటివల్ల శరీరంపై దద్దుర్లు, దురదకు కారణమవుతాయి. ఈ రసాయలను పీల్చడం కూడా ప్రమాదకరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరోనాకు స్వీయ చికిత్స జోలికి వెళ్లకుండా నిపుణుల సూచనల సూచనలు పాటించడం మంచిది.
కరోనాకు ఈ చిట్కాలు..
* కరోనా నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చు. నిత్యం చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవడం, నోటికి మాస్క్ ధరించాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తీయకండి. భౌతిక దూరాన్ని పాటించండి.
* బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటే వెంటనే తీసుకోవాలి.
* ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లి తగిన చికిత్స తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..