పిచ్చి మొక్కని పక్కకు పెట్టేస్తున్నారా.. నేల ఉసిరి ఆరోగ్యాల సిరి అని తెలుసా
14 November 2024
Pic credit - Getty
TV9 Telugu
ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి మొక్క అనేక రుగ్మతలకి, వ్యాధులకీ వైద్య విధానంలో ఉపయోగపడుతోంది.
నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టునుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు.
నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధమేనని చెప్పాలి.
కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యలకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్. ఈ రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మధుమేహానికి (డయాబెటిస్) ఈ జ్యూస్ చాలా మంచిది. నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.
ఈ మొక్క వేర్లను రోట్లో వేసి మొత్తగా నూరగా వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకుని ఉదయం సాయంత్రం తాగితే కామెర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు నేల ఉసిరి మంచి మందు. ఈ మొక్కను దంచి మద్దలో ఉప్పుతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట ఉంచితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఆకలి లేనివారు నేల ఉసిరి మొక్క ఆకుల్ని ఉదయం సాయంత్రం నమిలితే చక్కటి ఆకలి వేస్తుంది.