ఒక్క స్పూన్  కొబ్బరి నూనె తాగితే కలిగే ఉపయోగాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Phani CH

14 November 2024

సాధారణంగా కొబ్బరి నూనె తలకు రాసుకోవడానికి ఉపయోగిస్తామని చాలామందికి తెలుగు.. కేరళ రాష్ట్రం వారు కొబ్బరి నూనె వంట కోసం ఉపయోగిస్తారాని తెలుసు.

అయితే ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఒక నెలలోనే శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయట అయితే అవేంటో ఇపుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి  శరీరానికి సులభంగా లభించే శక్తి వనరులను అందిస్తాయి.

మన శరీరం లో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా  కొబ్బరి నూనె రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

కొబ్బరి నూనె యాంటీమైక్రోబయల్ లక్షణాలు అవాంఛిత పేగు బ్యాక్టీరియాను చంపుతాయి. అంతే కాకుండా ఉబ్బరం, మలబద్ధకం, ఇతర జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఉదయాన్నే కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు, మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. రక్తపోటు, మధుమేహం రోగులకు కూడా కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది.

ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చుకోండి.  కొబ్బరి నూనె వల్ల శరీరంలో గుండెకు మేలు చేసే మంచి కొవ్వు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.