AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!

ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!

Phani CH
|

Updated on: Nov 14, 2024 | 9:51 PM

Share

ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళితే అదృష్టం కలిసి వస్తుందని ఎవరు ఊహిస్తారు! కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు కలలో కూడా ఊహించనంత డబ్బు దక్కింది. నార్త్ కరోలినాలోని కెర్నర్స్‌విల్లేకు చెందిన కెల్లీ స్పార్ అనే మహిళ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ‘క్వాలిటీ మార్ట్‌’ అనే దుకాణానికి వెళ్లింది. జ్యూస్ తాగుతుండగా అక్కడే ఉన్న గ్యాస్ స్టేషన్‌లోని లాటరీ టికెట్లపై ఆమె దృష్టి పడింది.

వెంటనే తాగడం ఆపి వెళ్లి 20 డాలర్లతో ఒక టికెట్‌ను కొనుగోలు చేసింది. టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా ‘టాప్ ప్రైజ్ విన్నర్’ అని ఉంది. దీంతో ఆమె 2,50,000 డాలర్లు అంటే సుమారు రూ.2.10 కోట్లు గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘‘గ్యాస్ స్టేషన్ వద్ద కొత్త లాటరీ టిక్కెట్లు ఉన్నాయని గమనించాను. ఒక టికెట్ కొనుగోలు చేయాలని అనుకున్నాను. కింది భాగంలో మడత ఉన్న టికెట్ నా దృష్టిని ఆకర్షించింది. కొనుగోలు చేశాను’’ అని కెల్లి స్పార్ పేర్కొంది. ఈ డబ్బు తమ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కెల్లీ స్పార్ మాదిరిగానే ఇటీవల ఓ సాధారణ ఉద్యోగికి ఏకంగా 3 మిలియన్ డాలర్లు అంటే రూ.25.24 కోట్ల లాటరీ తగిలింది. లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న అతడికి భార్య ఫోన్ చేసి చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్తే ఆలస్యమవుతుందేమోనని మార్గమధ్యంలో ఒక దుకాణానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దీంతో అతడి తలరాత మారిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి.. కారణం ఇదేనా ??

దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!

మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??