జీడిపప్పు రోజుకు ఎన్ని తింటున్నారు? మోతాదుకి మించితే ప్రమాదమే..
14 November 2024
TV9 Telugu
TV9 Telugu
జీడిపప్పు అంటే ఎంతో ఇష్టమున్నా... చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ గుండెకు ఇవి చేసే మేలు మరే నట్స్ కూడా చేయవట. వీటిల్లో ఉండే పాలీఅన్‌శాచ్యురేటెడ్, మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
TV9 Telugu
ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా, ఇతర దుష్ఫలితాలు తలెత్తకుండా చేస్తాయట, ఇంకా గుండె జబ్బులు రాకుండానూ కాపాడతాయి. వీటిల్లో ఎక్కువగా ఉండే మెగ్నీషియం కూడా గుండెకు ఎంతో మంచిదిజీడిపప్పులో ఉండే అధిక కాపర్ రక్తహీనత నుంచి కాపాడుతుంది
TV9 Telugu
ఇంకా జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. సెలీనియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్‌లతో ఉండే క్యాషూ ఆయిల్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందట. పైగా ఇది కొన్ని రకాల క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది
TV9 Telugu
జీడిపప్పులోని జింక్, కాపర్, విటమిన్-ఇ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, ఎముకలు దృఢంగా అవుతాయి
TV9 Telugu
జీడిపప్పులో అధిక మొత్తంలో విటమిన్ కె, విటమిన్ బి6 రెండూ ఉంటాయి. జీడిపప్పులో కేలరీలు, కొవ్వు, పిండి పదార్థాలు ఉంటాయి. సన్నగా ఉన్న వ్యక్తుల బరువును పెంచడంలో ఇవి సహాయపడతాయి
TV9 Telugu
జీడిపప్పులో తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధించడంలో, టైప్-2 మధుమేహాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది
TV9 Telugu
బాదం, కిస్మిస్‌లతో పోలిస్తే జీడిపప్పు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. కానీ జీడిపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది
TV9 Telugu
కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే వీటిని ఎల్లప్పుడూ తీసుకోవాలి. రోజుకు 28 నుంచి 30 గ్రాములకు మించకుండా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు