Solar Eclipse: బెజవాడ దుర్గమ్మ దర్శనం సోమవారమే..!
Solar Eclipse: సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు రాహుగ్రస్థ సూర్యగ్రహణం ఏర్పడనున్న సందర్భంగా ఆలయాన్ని మూసివేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. శనివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించిన అధికారులు ఆలయ తలుపులు మూసివేశారు. తిరిగి ఆదివారం సూర్యగ్రహణం విడిచిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు స్నపనాది కార్యక్రమాలు నిర్వహించాక అమ్మవారికి […]
Solar Eclipse: సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు రాహుగ్రస్థ సూర్యగ్రహణం ఏర్పడనున్న సందర్భంగా ఆలయాన్ని మూసివేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు.
శనివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించిన అధికారులు ఆలయ తలుపులు మూసివేశారు. తిరిగి ఆదివారం సూర్యగ్రహణం విడిచిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు స్నపనాది కార్యక్రమాలు నిర్వహించాక అమ్మవారికి పంచహారతులు ఇస్తారు. తిరిగి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. సోమవారం (జూన్ 22) ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి ఆర్జిత సేవలు ప్రారంభం అవుతాయి. సోమవారం వరకు అమ్మవారి దర్శనం ఉండదు.