ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ముఖేశ్ కు 9వ స్థానం కల్పించింది. ముఖేశ్ నికర సంపదను 64.5 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. దీంతో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ప్రాభవం మరింత పెరిగింది. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ […]

  • Sanjay Kasula
  • Publish Date - 9:38 pm, Sat, 20 June 20
ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ముఖేశ్ కు 9వ స్థానం కల్పించింది. ముఖేశ్ నికర సంపదను 64.5 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. దీంతో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ప్రాభవం మరింత పెరిగింది.

ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ లను కూడా ముఖేశ్ అంబానీ అధిగమించారు. ప్రపంచం మొత్తం కొవిడ్-19తో కుదేలవుతున్నా సమయంలో కూడా జియో ప్లాట్ ఫామ్స్ లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రిలయన్స్ లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల పుణ్యమా అని జియో ప్లాట్ ఫామ్స్ ను రుణరహిత సంస్థగా మార్చేశారు.