కరోనా కరాళనృత్యం.. ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షలకి చేరిన కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్

కరోనా కరాళనృత్యం.. ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షలకి చేరిన కేసులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2020 | 10:19 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 88,22,397కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,64,035కి చేరింది. ఇక ప్రస్తుతం 3,695,496 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4,662,866 గా ఉంది.

ఇక అమెరికా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ జోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో 1,228,939 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే బ్రెజిల్‌లో 469,118 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.