Corona: దేశంలో ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. 85.6శాతం కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయంటే..?
COVID-19 India: దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి నానాటికీ పెరగుతోంది. ఇటీవల 20వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త మళ్లీ.. దేశంలో భారీగా..
COVID-19 India: దేశంలో కరోనావైరస్ కేసుల ఉధృతి నానాటికీ పెరగుతోంది. ఇటీవల 20వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త మళ్లీ.. దేశంలో భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు పలువురు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో పలు కఠిన ఆంక్షలు తీసుకోవాలంటూ కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను సైతం జారీ చేసింది. చాలా రోజుల అనంతరం గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురించేస్తోంది. నిన్న కొత్తగా 23,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 117 మంది మృతిచెందారు.
అయితే ఈ కేసులు ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త కేసుల్లో 85.6 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ ఆరు రాష్ట్రాల్లోనే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. దీనిపై నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, పలు అంశాలపై చర్చించి అప్రమత్తం చేస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదిలాఉంటే.. నిన్న 19 రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని కేంద్రం తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, చండీగఢ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, మణిపూర్, డామన్ డయ్యూ, మిజోరం, లడఖ్, అండమాన్ నికోబార్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వెల్లడించారు.
Also Read:
-
COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటలకే.. బెంగాల్లో ఇద్దరు వృద్ధుల మృతి..
-
Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఎక్కవగా ఏ రాష్ట్రంలో అంటే..?
-
Corona Virus: మహారాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే..