ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సింగపూర్ అనుమతి.. నెల ఆఖరులో టీకా పంపిణీకి ఏర్పాట్లు..
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సింగపూర్ అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అటు అమెరికాతో సహ పలు దేశాలు ఈ టీకా
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సింగపూర్ అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అటు అమెరికాతో సహ పలు దేశాలు ఈ టీకా పంపిణీకి అమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన పంపిణీకి ఈ నెల ఆఖరులో ప్రారంభిస్తామని ఆ దేశ ప్రధాని లీసీన్ లూంగ్ తెలిపారు. ప్రజలందరికి ఉచితంగానే ఈ టీకాను పంపిణీ చేయనున్నట్లు పేర్కోన్నారు. అంతే కాకుండా అక్కడే చాలా కాలం నుంచి నివసిస్తున్న వారికి కూడా ఈ వ్యాక్సిన ఉచితంగానే పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాబోయే సంవత్సరం 3 నెలల్లో దాదాపు సింగపూర్‌లోని ప్రజలందరికి ఈ టీకాను పూర్తిగా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ముందుగా తనతోపాటు ప్రభుత్వ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, కరోనా ఆరోగ్య సిబ్బంది, వృద్దులకు ఈ టీకా అందిస్తామని తెలిపారు. అయితే స్వచ్చందంగా వచ్చే వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. అటు ఫైజర్ టీకాతోపాటు మోడెర్నా, సినోవాక్ టీకా కంపెనీలతోనూ సింగపూర్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అటు ఈ వ్యాక్సిన్ల అనుమతికి ఆమోదం పొందిన తర్వాత ఈ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించనున్నట్లు స్పష్టం చేసింది.