జోరు మీదున్న దేశీ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో దూసుకుపోయాయి. ఈ రోజు పారంభం నుంచి మార్కెట్లు లాభాలను మూటగటుకున్నాయి....

జోరు మీదున్న దేశీ మార్కెట్లు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2020 | 5:14 PM

Climb up for the Fourth day : దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో దూసుకుపోయాయి. ఈ రోజు పారంభం నుంచి మార్కెట్లు లాభాలను మూటగటుకున్నాయి. ప్రారంభమైన గంట నుంచి ఇన్వెస్టర్లు కొనుగోల్లపైనే దృష్టి పెట్టడంతో మార్కెట్లలో మంచి జోష్ కనిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 466 పాయింట్లు లాభపడి 36,487కి పెరిగింది. రియల్టీ, ఆటో, మెటల్ షేర్లు దూకుడు ప్రదర్శించగా.. ఫార్మా కంపెనీ షేర్లు స్వల్పంగా వెనకబడ్డాయి.

అయితే..ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 0.6 శాతం మాత్రమే నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌, ఐటీ 3-1.2 శాతం మధ్య ముందుకు సాగాయి.

అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాలు సానుకూలంగా ఉండటంతో దేశీయంగా సూచీలు లాభల బాటపట్టాయి. ఇక భారత్‌లో టీకా తయారీపై ఆశలు పెరగడం కూడా సూచీలను ముందుకు తీసుకెళ్లింది. భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిల్లా తయారు చేస్తున్న టీకాలు కీలక దశకు చేరుకున్నాయి. మరోపక్క గిలీద్‌ సైన్సెస్‌, ఫ్యూజీ ఫిల్మ్‌కు చెందిన ఔషధాల రాకతో చికిత్స కూడా వేగవంతమైంది. ఇలాం అంశాలు కొంత కలిసివచ్చాయి.