Coronavirus: సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు.. కరోనాపై కేంద్రం కీలక హెచ్చరిక

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్‌....

Coronavirus: సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు.. కరోనాపై కేంద్రం కీలక హెచ్చరిక
Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2021 | 10:04 AM

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్‌ తర్వాతా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల్లో 58.4శాతం ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3.33లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో లక్షన్నరకు పైగా కేరళలోనే ఉన్నాయన్నారు. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో 10 వేలు నుంచి లక్ష మధ్య ఉండగా.. 31 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం 10వేల కన్నా తక్కువ ఉన్నట్టు వివరించారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగానే ఉందన్నారు. దేశం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మధ్యలో ఉందన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌. సెప్టెంబర్, అక్టోంబర్ నెలల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

తాజాగా నమోదైన 46వేల కొత్త కేసుల్లో దాదాపు 58శాతం కేరళలోనే నమోదు అయినట్టు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కొవిడ్‌ తగ్గుదల ట్రెండ్‌ కనబడుతోందన్నారు. దేశంలోని మొత్తం క్రియాశీల కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 51.19% ఉండగా.. మహారాష్ట్రలో 16.01%, కర్ణాటక 5.8%, తమిళనాడు 5.5%, ఆంధ్రప్రదేశ్‌లో 4.21%గా ఉన్నట్టు వివరించారు. అలాగే, 24గంటల వ్యవధిలో 80లక్షల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జూన్‌ తొలి వారంలో 100కి పైగా కేసులు 279 జిల్లాల్లో నమోదవ్వగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41 జిల్లాలకు చేరిందని తెలిపారు. రికవరీ రేటు పెరుగుతోందని, ప్రస్తుతం 97శాతానికి పైగా ఉన్నట్టు పేర్కొన్నారు.

Also Read: వంకాయ, బీరకాయ కేజీ అర్ధరూపాయి.. టమాట 2 రూపాయలు.. కన్నీరు పెడుతున్న రైతులు

కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు