కళాకారులకు సల్మాన్ సహాయం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన దాతృత్వానికి చాటుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబందులు పడుతున్న పేద కళాకారులకు అండగా నిలిచారు.

  • Sanjay Kasula
  • Publish Date - 3:27 pm, Mon, 1 June 20
కళాకారులకు సల్మాన్ సహాయం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన దాతృత్వానికి చాటుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇబందులు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలిచారు.
ఉపాధి కోల్పోయినవారికి సహాయాన్ని అందిస్తున్నారు.
ప‌న్వెల్ ఫాం హౌజ్ ప‌రిస‌రాల‌లో ఉన్న పేద ప్ర‌జ‌ల‌కి నిత్యావ‌స‌రాలు అందజేశారు. గత నెలకో రంజాన్ పండుగ సంద‌ర్బంగా ఐదు వేల కుటుంబాల‌కి పాయ‌సం కిట్స్ అందించారు.

ఇప్పుడు తాజాగా స‌ల్మాన్ థియేటర్ కళాకారుల కోసం ముంబై ఆడిటోరియంలో ఫుడ్ పార్సల్స్‌ను పంపిణీ చేశారు. గత ఆదివారం, సల్మాన్ ఖాన్ రెండు ఆహార ట్రక్కులను పరేల్‌లోని దామోదర్ నాట్యగ్రూహాకు, కార్మికుల కోసం దాదర్‌లోని శ్రీ శివాజీ మందిర్ నాట్యగ్రూహాకు పంపారు.