AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కూటమి హవా తగ్గలేదా.. వైసీపీకి పట్టు చిక్కలేదా?.. పుర ఓటు ఏం తేల్చింది..!

వైసీపీ అధినేత జగన్‌పై కేసు నమోదు..! మున్సిపల్ బ్రేకింగ్స్ మధ్యలో వినిపించిన ఆసక్తికరమైన మరో బ్రేకింగ్ ఇది. పర్మిషన్ లేకుండా పులివెందుల ఆర్వో ఆఫీసు దగ్గర ధర్నా చేసినందుకు జగన్‌పై కేసు రిజిస్టరైంది. ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రాకుండా అడ్డుకున్నారంటూ జగన్ చేసిన మెరుపు ధర్నాకు పోలీసులిచ్చిన ఫినిషింగ్ టచ్ ఇది. కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కావడం కొత్తేమీ కాకపోయినా, అపోజిషన్ పార్టీ అధినేతపైనే అభియోగాలు మోపడం కచ్చితంగా అండర్‌లైన్ చేసుకోదగ్గదే. పురపోరు ఫలితం ఇచ్చిన నైతిక ఉత్సాహంతో సర్కారీ వారి ఎఫెన్స్ గేమ్ జోరందుకుందా అనడానికి ఇదొక సంకేతం అనుకోవచ్చా? నిజంగానే మున్సిపల్ రిజల్ట్‌ ఏపీలో పొలిటికల్ టెంపర్స్‌ని ప్రభావితం చెయ్యబోతుందా? కూటమికి జరిగిన ఈ పట్టణాభిషేకం పూర్వాపరాలు, పర్యవసానాలు ఏంటో డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

Andhra Pradesh: కూటమి హవా తగ్గలేదా.. వైసీపీకి పట్టు చిక్కలేదా?.. పుర ఓటు ఏం తేల్చింది..!
Ap Urban Local Body Election Results
Krishna S
|

Updated on: Nov 03, 2026 | 10:16 PM

Share

అతిశయం కాకపోయినా కచ్చితంగా ఇది ఆసక్తికరమే. పెద్దగా షాకింగ్ ఇవ్వకపోయినా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది బిగ్ బ్రేకింగే. స్థానిక పోరులో ఫస్ట్‌ కిక్ కొట్టి దాదాపు 80 శాతం పుర ఓటును క్యాప్చర్ చేసి, వైసీపీని మళ్లీ మైనారిటీలోకి తోసింది కూటమి. ఓటమిని అంగీకరించడం, జీర్ణించుకోవడం మాట అటుంచితే, ఫలితం తిరగబడుతుందని ముందే ఊహించి మానసికంగా సిద్ధమైన వైసీపీ.. పోస్ట్‌మార్టమ్‌ అవసరం లేకుండా చేసుకుంది. ఓటమికి కారణాలు ఫలానా అని లిస్టవుట్ చేసుకోకపోయినా, వై దిస్ డిబాకిల్ అని వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరాన్నయితే గ్రహించింది అపోజిషన్ పార్టీ. ఆశించినన్ని విజయాల్ని ఖాతాలో వేసుకున్న కూటమిలో మాత్రం జోష్‌ పెరిగిందనే చెప్పొచ్చు. కానీ, ఈ థంపింగ్ విక్టరీ వెనుక కూటమిలోపల భీకరమైన కసరత్తే జరిగింది. క్యాడర్‌ని దారికి తెచ్చి, ఒక లైన్లో నిలబెట్టడానికి మూడు పార్టీలూ పడిన శ్రమను కూడా రీకాల్ చేసుకోవాల్సిందే. చెప్పాం చేస్తున్నాం.. అని అప్పుడే ఢంకా బజాయించారు కూటమి పెద్ద చంద్రబాబు. స్థానికపోరులో వార్ వన్‌సైడే అని, అది కూడా కూటమి సైడేనని గట్టిగానే ఊహించారు. తమకు కలిసొచ్చిన డబులింజన్ సర్కార్ స్లోగన్‌ని త్రిపుల్ ఇంజన్‌ సర్కార్‌గా మార్చుకుని, లోకల్ ఓటు కోసం కొత్తగా ఫోకస్ పెట్టిన కూటమికి ఆశించిన ఫలితమే దక్కింది. నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీనిచ్చి దాదాపు ఏపీ అంతటా యూనిఫామ్‌గా కూటమి మీదున్న మమకారాన్ని కంటిన్యూ చేశాడు పుర ఓటరు. మిగతా స్థానిక ఎన్నికల్లో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి