గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..
ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు జనాలు. అందులోనూ కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధర పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బంగారం ధరల రూ.50 వేలకు పైగానే చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర...
ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు జనాలు. అందులోనూ కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధర పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బంగారం ధర రూ.50 వేలకు పైగానే చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర హై రేటుకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. దీంతో ప్రజలు పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు. అందులోనూ ప్రస్తుతం ఆషాఢ మాసం కనుక బంగారం రేటు తగ్గుతుందేమోనని పసిడి ప్రియులు ఎదురు చూస్తుంటే.. వారికి షాక్ ఇస్తూ హై రేటుకు చేరుకుంది.
దీంతో ఆర్బీఐ బ్యాంక్ బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటని అనుకుంటున్నారా? పసిడిని నేరుగానే కాకుండా బాండ్స్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం లభిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భాగంగా నాలుగో విడత గోల్డ్ బాండ్ అమ్మకాలను ప్రారంభించింది ఆర్బీఐ. జులై 6న ప్రారంభమైన ఈ అమ్మకాలు జులై 10వ తేదీ వరకూ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు కంటే సావరిన్ గోల్డ్ కాస్త తక్కువలో లభ్యమవుతుంది. ఈ సిరీస్‌కు ఒక గ్రాముకు రూ.4,852 ధర ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే డిజిటల్ పేమెంట్ చేసే వారికి గ్రాముకు 50 తగ్గుతుంది. అందులోనూ ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్లో ఉన్న రేటు కంటే ఇవి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ బాండ్స్‌ని అవసరమైనప్పుడు బంగారంలోకి మార్చుకోవచ్చు. అంతే కాకుండా వీటిని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు.