కరోనా మృతుని డెడ్ బాడీని విసిరేశారు
పుదుచ్ఛేరిలో దారుణం జరిగింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని హెల్త్ కేర్ వర్కర్లు ఓ గోతిలోకి విసిరేశారు. పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వర్కర్లు అంబులెన్స్ లో...

పుదుచ్ఛేరిలో దారుణం జరిగింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని హెల్త్ కేర్ వర్కర్లు ఓ గోతిలోకి విసిరేశారు. పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వర్కర్లు అంబులెన్స్ లో ఆ డెడ్ బాడీని తీసుకువఛ్చి నిర్లక్ష్యంగా ఈ అమానుషానికి పాల్పడ్డారు. తాము చేసిన ‘ఘన కార్యం’ గురించి తమ సూపర్ వైజర్ కి సైగ చేయగా.. ఆయన కూడా ‘మంచిపని చేసారు’ అన్నట్టుగా థంబ్స్ అప్ చూపి వారిని ప్రోత్సాహపరిచాడట. పైగా మృతుని శరీరంపై కేవలం ఓ తెల్ల వస్త్రం మాత్రమే కప్పారని, అది అప్పుడపుడు గాలికి లేచిపోయినప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిసింది. అసలు తమకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందన్న ధ్యాస కూడా వారికి లేదు. ఆ డెడ్ బాడీని పూర్తిగా ఖననం చేశారా అన్నది కూడా తెలియలేదు. చెన్నై కి చెందిన ఈ వ్యక్తి పుదుచ్ఛేరిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ హెల్త్ కేర్ వర్కర్ల విషయం తెలిసి వీరిపై ప్రభుత్వం క్రమ శిక్షణ చర్యలకు ఆదేశించింది. భారత శిక్షా స్మృతి లోని 500 సెక్షన్ కిందా వీరిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.



