ఆ నిర్మాతకు రెండోసారీ కూడా పాజిటివ్‌…

ఆ నిర్మాతకు రెండోసారీ కూడా పాజిటివ్‌...

క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి చికిత్స పొందుతున్న ప్ర‌ముఖ నిర్మాతకు రెండోసారి కూడా వైర‌స్ పాజిటివ్‌గా వ‌చ్చింది.

Jyothi Gadda

|

Apr 14, 2020 | 1:48 PM

క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి చికిత్స పొందుతున్న ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్‌ మొరానీకి రెండోసారి కూడా వైర‌స్ పాజిటివ్‌గా వ‌చ్చింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా మ‌రోసారి కరీంకు టెస్ట్‌లు చేసిన వైద్యులు..అత‌డు ఇంకా కోవిడ్‌ బారి నుంచి కోలుకోలేదని తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 60 ఏళ్లు పైబ‌డిన‌ కరీంకు రెండుసార్లు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని వారి స‌న్నిహితులు చెప్పారు. ఈ క్రమంలో ఆయనకు బైపాస్‌ సర్జరీ కూడా నిర్వహించారని.. కరోనా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలుత కరీమ్‌ కుమార్తెలు జోవా, షాజాలకు వైర‌స్ నిర్ధార‌ణ అయింది. ఆ త‌ర్వాత క‌రీమ్‌కు వైర‌స్ సంక్ర‌మించింది. ప్ర‌స్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’(2013), ‘దిల్‌వాలే’ (2015) చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా, ‘రా.వన్‌’(2011), ‘హ్యాపీ న్యూఇయర్‌’ (2014) చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి.. బాద్‌షా సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు క‌రీమ్ మొరానీ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu