Covid Vaccination: దేశవ్యాప్తంగా మొదలైన మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్… టీకాల కొరతతో ఇక్కట్లు పడుతున్న రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనా.. చాలా చోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇవాళ్టి నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Covid Vaccination: దేశవ్యాప్తంగా మొదలైన మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్... టీకాల కొరతతో ఇక్కట్లు పడుతున్న రాష్ట్రాలు
Follow us

|

Updated on: May 01, 2021 | 12:08 PM

Phase 3 Covid-19 vaccination: దేశవ్యాప్తంగా థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనా.. చాలా చోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇవాళ్టి నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ కోసం రెండున్నర కోట్లమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే కేంద్రంతో పాటు రాష్ట్రాల దగ్గర అందులో సగం టీకాలు కూడా లేవు. చాలా రాష్ట్రాలు 18 ఏళ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం ఇప్పుడే సాధ్యం కాదని ప్రకటించాయి. చాలా మందికి రెండో డోస్ ఇచ్చేందుకు కూడా వ్యాక్సిన్లు లేవంటున్నాయి రాష్ట్రాలు.

తెలంగాణలో మూడో దశ వ్యాక్సినేషన్‌ను రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకిటించింది. సోమవారం నుంచి వ్యాక్సిన్లు వేయనున్నారు. అయితే అది కూడా 45 ఏళ్ల పైబడిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణలోని కొన్ని ఆసుపత్రుల్లో బ్లాక్ మార్కెట్‌లో టీకాలు వేసే ప్రక్రియ నడుస్తోంది. టోకా డోసుల కొరత వల్ల ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్‌ను ఆపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్లు వృదా కాకుండా ఇన్‌టైమ్‌లో మారుమూల ప్రాంతాలకు చేరేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోంది తెలంగాణ ఆరోగ్య శాఖ.

ఏపీ ప్రభుత్వం కూడా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్‌ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ ఏజ్ గ్రూప్‌లో 2 కోట్ల మందికిపైగా ఉంటారని అంచనా. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటినవారిలో ఇంకా చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. 18-45 మధ్య వయస్సు వారికి టీకాల నిమిత్తం 4.08 కోట్ల టీకా డోసులు అవ‌స‌రం అని.. కానీ అన్ని టీకాలు అందుబాటులో లేకపోవడంతో అందరికీ టీకాలు వేయడం సాధ్యం కాదంటోంది ఏపీ సర్కారు. ఏపీలో వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో ఎదుర‌వుతోన్న ఇబ్బందులను వివరిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్ మరో లేఖ రాయనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 18-45 మ‌ధ్య ఏజ్ గ్రూప్‌కు కోవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించ‌ లేదంటోంది ఏపీ సర్కారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు.

వ్యాక్సిన్ డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టలేమని జమ్మూ కశ్మీర్‌లో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. మే 20 తర్వాత రాష్ట్రానికి టీకా డోసులు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు నమోదు చేసుకున్న వారి కోసం స్లాట్లవారీగా కొత్త డాటాను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కొత్త వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి రానందున మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. సీరం సంస్థకు కోటి డోసులు కావాలని ఆర్డర్‌ చేశామని, అవి వచ్చాకే మూడో దశ ప్రారంభం అవుతుందన్నారు కర్నాటక ఆరోగ్య మంత్రి.

వ్యాక్సిన్‌ డోసుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది మహారాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం సహకరించకున్నా మూడో విడతను పరిమిత డోసులతో ప్రారంభిస్తామని తెలిపింది. రాష్ట్రానికి ఇంకా వ్యాక్సిన్‌ డోసులు రాలేదని, అందుకే.. పోర్టల్‌లో నమోదు చేసుకున్న 18-45 ఏళ్ల వారంతా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రానున్న రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి 3 లక్షల డోసులు వస్తాయని అప్పుడే డ్రైవ్‌ మొదలు పెడతామని చెప్పారు. టీకాలు సరిపడా ఉన్న రాష్ట్రాలు రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

వ్యాకినేషన్ కోసం కోవిన్, ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకన్న వాళ్లు వ్యాక్సినేషన్ సెంటర్లకు వస్తున్నారు. వ్యాక్సిన్లు లేకపోవడంతో పోలీసులు వాళ్లను వెనక్కి పంపిస్తున్నారు. టీకా సెంటర్ల వద్ద రద్దీ కారణంగా కొత్త సమస్యలు రావచ్చని ఆధికారులు ఆందోళన చెందుతున్నారు.

Read Also…  Corona Virus: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..