కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి కారణాలివేనట..!

కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నా.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అధ్యయనం చేసిన అమెరికాలోని

కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి కారణాలివేనట..!
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2020 | 2:15 PM

Coronavirus Asymptomatic cases: కరోనా సోకిన కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నా.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అధ్యయనం చేసిన అమెరికాలోని ఓ బృందం పలు కీలక విషయాలను వెల్లడించింది. కొందరిలో లక్షణాలు కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక కారణముందని వారి పరిశోధనల్లో తేలింది. వైరస్‌లోని ఓ రకమైన ప్రొటీను మనుషుల నాడీమండలానికి, నొప్పి సంకేతాలను పంపే రిసెప్టర్లను నిర్వీర్యం చేస్తుందని.. అందుకే కొంతమందిలో స్వల్ప లక్షణాలు, ఇంకొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని వారు కనుకొన్నారు. దీని వలన వైరస్ వ్యాప్తికి వారు ఒక కారణం అవుతున్నారని ఈ బృందం వెల్లడించింది.

కరోనా సోకిన రోగిలో తొలి లక్షణమైన నొప్పిని వైరస్ స్పైక్ ప్రొటీన్ తెలియనివ్వదు. అలాగే నొప్పి సంకేతాలను శరీరానికి పంపే సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. దీని వలన కొంతమందిలో ఎలాంటి నొప్పి తెలీదు. మొదట ఏసీఈ రిసెప్టర్లలో ఈ వైరస్ సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. ఆ తరువాత సార్స్ కోవ్‌ 2 కూడా శరీరంలోని న్యూరోపిలిన్‌-1కి సోకుతుందని తేల్చారు. ఈ అంశం తమను ఆకర్షించిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ రాజేష్ ఖన్నా అన్నారు.

Read More:

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ఫైనల్ ఎపిసోడ్‌లకి నాగార్జున ఉండరా..!

నాచురల్ స్టార్‌తో ‘ఉప్పెన’ బ్యూటీ..!