కరోనా ఎఫెక్ట్: ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ఒడిశా సర్కార్ భరోసా..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారినపడి వైద్యులు, పోలీసులు, ఉద్యోగులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అంగన్ వాడీ, ఆశా కార్యకర్తల కోసం ఒడిశా ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా బారినపడి వైద్యులు, పోలీసులు, ఉద్యోగులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అంగన్ వాడీ, ఆశా కార్యకర్తల కోసం ఒడిశా ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో కరోనా బారిన పడి మరణించిన ఆయా కుటుంబాలకు సర్కార్ భరోసా కల్పిస్తోంది.
అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల కోసం ఒడిశా ప్రభుత్వం సరికొత్త కొత్త పథకాన్ని అమలుచేస్తోంది. కరోనా నేపథ్యంలో విధి నిర్వహణలో వైరస్ బారినపడి చనిపోయిన అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. వారి 60 ఏళ్ల సర్వీసు కాలం వరకు బాధిత కుటుంబాలకు సంబంధిత వేతనాన్ని ఇస్తామని చెప్పింది. అంగన్‌వాడీ కార్యకర్తల బాధిత కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున, ఆశా కార్యకర్తల బాధిత కుటుంబాలకు నెలకు రూ.5,000 చొప్పున పింఛను చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వును ఒడిశా ప్రభుత్వం విడుదల చేసింది.




