బ్రెజిల్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు.. ఒక్క రోజే 54 వేలకు పైగా..

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 54, 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ పది లక్షలకు పైగా కేసులు నమోద్యాయి.

బ్రెజిల్‌లో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదు.. ఒక్క రోజే 54 వేలకు పైగా..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 8:03 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 54, 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ పది లక్షలకు పైగా కేసులు నమోద్యాయి. ఈ విషయాన్ని బ్రెజిల్ జాతీయ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,206 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 48వేలు దాటింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 5.07 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా, రష్యా తర్వాత. బ్రెజిల్ కూడా ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం చూస్తుంటే.. మరో వారం పది రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు కోటికి చేరువయ్యేలా ఉన్నాయి. అయితే వ్యాక్సిన్‌పై ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉండటం ఊరటనిస్తున్నప్పటికీ.. ఎంత త్వరగా వస్తే.. అంత మంచిదని అంతా కోరుకుంటున్నారు.