ఇండియా.. 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14,516 కేసులు నమోదయ్యాయి. మొత్తం 395,048 కేసులు రిజిస్టర్ కాగా.. 12,948 మంది రోగులు మరణించారు. 168,269 యాక్టివ్

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14,516 కేసులు నమోదయ్యాయి. మొత్తం 395,048 కేసులు రిజిస్టర్ కాగా.. 12,948 మంది రోగులు మరణించారు. 168,269 యాక్టివ్ కేసులు కాగా.. 213,831 మంది రోగులు కోలుకున్నారు. ఢిల్లీ లోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డులకు గాను హోమ్ శాఖ కరోనా టెస్టింగ్ రేట్లను నిర్ణయించడం సామాన్యుడికి ఊరట నిచ్ఛే అంశం. అటు తమిళనాడులో కేసులు 56,845 కి చేరుకున్నాయి. శనివారం ఒక్కరోజే 38 మంది రోగులు మరణించారు. కాగా..రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ.. కేంద్రం మునుపటి మాదిరిగా ఈ రేటును స్పష్టం చేయడంలేదు. ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ గతంలో మాదిరి ప్రెస్ మీట్లు పెట్టడం మానుకుని అఫీషియల్ నోట్ ను మాత్రం విడుదల చేస్తున్నారు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం కరోనా కేసులను ఈ నోట్ లో పేర్కొంటున్నారు.



