AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితానికి సరిపోయే అనుభవాన్ని ఇచ్చావు: సుశాంత్‌కి భూమి నివాళి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరు రోజులు అవుతున్నా ఆయనను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్, సుశాంత్‌కి సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ”ఇవాళ లేస్తునే నీ గురించి ఆలోచించాను. మన మాటలు, నీ అలవాట్లు అన్నింటి గురించి ఆలోచించా. వెంటనే చాలా బాధ అనిపించింది. నీ గురించి ఇంతలా బాధపడుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. మనమిద్దరం మొదటి రోజు కలిసినప్పుడు.. నాకు నక్షత్రాలు చూపిస్తానని […]

జీవితానికి సరిపోయే అనుభవాన్ని ఇచ్చావు: సుశాంత్‌కి భూమి నివాళి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 9:34 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరు రోజులు అవుతున్నా ఆయనను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్, సుశాంత్‌కి సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ”ఇవాళ లేస్తునే నీ గురించి ఆలోచించాను. మన మాటలు, నీ అలవాట్లు అన్నింటి గురించి ఆలోచించా. వెంటనే చాలా బాధ అనిపించింది. నీ గురించి ఇంతలా బాధపడుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు.

మనమిద్దరం మొదటి రోజు కలిసినప్పుడు.. నాకు నక్షత్రాలు చూపిస్తానని చెప్పావు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎన్నో విషయాలను నువ్వు నాకు వివరించావు. ఓ సహ నటుడి నుంచి నాకు టీచర్‌గా మారావు. నీ దగ్గర నేర్చుకునేందుకు పెన్, పేపర్ పట్టాలనిపించేది. ఏదైనా నువ్వు వివరిస్తుంటే దాన్ని చాలా ఆసక్తిగా వినాలని అనిపిస్తుంటుంది. చిన్న పిల్లాడిలా ఉండే నువ్వు మమల్ని చందమామ వద్దకు తీసుకెళ్లి వెనక్కి తీసుకురాగలవు. నన్ను ఎడమ చేతితో రాయమని, క్విజ్‌లను సాల్వ్ చేయమని సవాల్ చేసేవాడివి. వాటిని నేను కూడా చేసేదాన్ని. సిద్ధాంతాలు, విజయం, జీవితం గురించి మనం మాట్లాడుకునే వాళ్లం.

ఎన్నో విషయాల్లో మనిద్దరి మధ్య గొడవలు, డిబేట్‌లు జరిగేవి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నువ్వు చాలా ఎగ్జైట్ అయ్యేవాడివి. నీ దగ్గర నుంచి సమాధానం రాబట్టం అంత ఈజీ కాదు. ఓ లెర్నింగ్ టాస్క్‌లాగా మార్చేసేవాడివి. జీవితానికి సరిపోయే అనుభవాన్ని ఇచ్చావు. నీ కోసం ఇప్పుడు ప్రపంచం ఎంత బాధపడుతుందో నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నా. నిన్ను కలిసిన వాళ్లే కాదు కలవని వారు కూడా చాలా బాధపడుతున్నారు. నువ్వు చేసిన పనిలో నీ ఙ్ఞానం ఎప్పటికీ జీవించి ఉంటుంది. టెలిస్కోప్‌తో నిన్ను నేను గుర్తించగలను. అది చాలా సులువైన పని. ఎందుకంటే నువ్వు బాగా ప్రకాశించే నక్షత్రానివి. నువ్వు డబుల్ స్లిట్ ఫ్రొటాన్, న్యూట్రన్‌ నక్షత్రానికివి. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతుంటాము సుశాంత్” అని ఆమె రాసుకొచ్చారు. కాగా సుశాంత్, భూమి ‘సోంచారియా’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

https://www.instagram.com/p/CBnkAFzJhWs/?utm_source=ig_embed

Follow Us
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
ఈ పాము యమ డేంజర్.. దీని తల త్రిభుజాకారంలో
ఈ పాము యమ డేంజర్.. దీని తల త్రిభుజాకారంలో
గురు, చంద్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, అధికార యోగాలు
గురు, చంద్రుల పరివర్తన.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, అధికార యోగాలు
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్.. బర్త్‌డే వేడుకలు వైరల్‌
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్.. బర్త్‌డే వేడుకలు వైరల్‌
పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ ట్రైన్.. స్పెషాలిటీలు ఇవే..
పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ ట్రైన్.. స్పెషాలిటీలు ఇవే..
మహేష్ డిగ్రీ ఐడెంటిటీ కార్డు .. అప్పట్లో బాబు ఎలా ఉన్నాడో చూశారా?
మహేష్ డిగ్రీ ఐడెంటిటీ కార్డు .. అప్పట్లో బాబు ఎలా ఉన్నాడో చూశారా?
చాణక్యుడు చెప్పిన హెచ్చరిక: ఈ ఐదు పనులను వాయిదా వేస్తే భారీ నష్టం
చాణక్యుడు చెప్పిన హెచ్చరిక: ఈ ఐదు పనులను వాయిదా వేస్తే భారీ నష్టం
రామాయణాన్ని తలపించిన వింత.. ఆ అడవుల్లో అరుదైన తెల్ల జింక దర్శనం..
రామాయణాన్ని తలపించిన వింత.. ఆ అడవుల్లో అరుదైన తెల్ల జింక దర్శనం..
బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం: SRH కెప్టెన్
బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం: SRH కెప్టెన్