Covid 19: కరోనా మహమ్మారి సరికొత్త రూపం.. కలవరపెడుతున్న న్యూ వేరియంట్.. దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తింపు!

కరోనా వైరస్‌ మరోమారు కొత్త రూపు దాల్చింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తించినట్టు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ సైంటిస్టులు తెలిపారు.

Covid 19: కరోనా మహమ్మారి సరికొత్త రూపం.. కలవరపెడుతున్న న్యూ వేరియంట్..  దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తింపు!
New Variant Of Covid 19 Detected In South Africa
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 01, 2021 | 9:17 AM

New Variant of COVID-19: అందరూ భయపడుతున్నట్లే జరిగింది. కరోనా వైరస్‌ మరోమారు కొత్త రూపు దాల్చింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో గుర్తించినట్టు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ సైంటిస్టులు తెలిపారు. కరోనా సృష్టించిన కల్లోలాన్ని పూర్తిగా మరవక ముందే మరోవార్త భయపెడుతోంది.

కరోనా కొత్త వేరియంట్‌ను సైంటిస్టులు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో మే నెలలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని, ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో దీని జాడలు కనిపించాయని హెచ్చరించారు. ఈ వైరస్‌ కరోనా టీకాలు కల్పించే రక్షణను దాటుకొని సోకుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్‌లో ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని ఎన్‌ఐసీడీ సైంటిస్టులు వెల్లడించారు.

దక్షిణాఫ్రికాలో ప్రతినెలా ఈ వేరియంట్‌ జీనోమ్స్‌ సంఖ్య పెరుగుతూవస్తోందని ఓ అధ్యయనం తెలిపింది. గతంలో బీటా, డెల్టా వేరియంట్లలో కూడా జీనోమ్స్‌ ఇలాగే పెరిగాయి. కొత్తగా కనుగొన్న వేరియంట్‌లో మ్యుటేషన్‌ రేటు సంవత్సరానికి 41.8 శాతంగా ఉందని తెలుస్తోంది. ఇతర వేరియంట్ల మ్యుటేషన్‌రేటు కన్నా ఇది దాదాపు రెట్టింపని అధ్యయనం తెలిపింది. సగానికిపైగా సీక్వెన్సుల్లో 14 మ్యుటేషన్లున్నాయని, ఇతర స్వీక్వెన్సుల్లో అదనపు మ్యుటేషన్లు జరుగుతూనే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. కొత్త వేరియంట్‌ స్పైక్‌ ప్రాంతంలో జరుగుతున్న మ్యుటేషన్లలో 52 శాతం గత వేరియంట్లలో కనిపించినవేనని, మిగిలినవి కొత్త మ్యుటేషన్లని చెబుతున్నారు. స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారానే కరోనా వైరస్‌ మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇప్పుడున్న పలు వ్యాక్సిన్లు ఈ స్పైక్‌ప్రాంతాన్నే టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ఈ వేరియంట్‌లో కనిపిస్తున్న మ్యుటేషన్లు కొన్ని యాంటీబాడీల నుంచి తప్పించుకొని పోయేందుకు ఉపయోగపడేవని సైంటిస్టులు వివరించారు. కొత్త మ్యుటేషన్లు ఇప్పటివరకు ఉన్న వేరియంట్లలో లేవని, యాంటీబాడీలను వైరస్‌ తప్పించుకోగలదని వార్నింగ్‌ ఇస్తున్నారు.

Read Also…  బ్రాడ్‌మన్‌కే చుక్కలు చూపించిన స్పిన్నర్.. 9 పరుగులకే 7 వికెట్లు.. కేవలం 38 ఏళ్లకే జైలులో మరణించాడు.. ఎందుకో తెలుసా?

Covid 19 Third Wave: సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థర్డ్ వేవ్.. హెచ్చరించిన ఐసీఎంఆర్.. అదనపు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం