కరోనా కాటుతో ఎన్సీపీ నేత మృతి..

కరోనా మహమ్మారి కాటుకు మరో రాజకీయ నేత మరణించారు. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అంతేకాదు.. ఇక్కడే అటు..

కరోనా కాటుతో ఎన్సీపీ నేత మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 3:54 PM

కరోనా మహమ్మారి కాటుకు మరో రాజకీయ నేత మరణించారు. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అంతేకాదు.. ఇక్కడే అటు సామాన్య ప్రజలతో పాటు.. రాజకీయ నాయకులకు, పోలీసులకు కూడా ఎక్కువగా సోకుతుంది. అంతేకాదు.. సామాన్య ప్రజలతో పాటు.. అటు ప్రజా ప్రతినిధులు, పోలీసులు కూడా కరోనా కాటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మహారాష్ట్రలోని ఎన్సీపీ పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్ మరణించారు. పూణెలోని పింప్రీ-చించువాడ్‌ మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన కార్పోరేటర్ దత్త సనే శనివారం ఉదయం మరణించారు. ఈయన గత నెల జూన్‌ 24న కరోనా బారినపడి స్తానికంగా ఉన్న ఆదిత్య బిర్లా మెమెరియల్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. శనివారం నాడు మరణించారు.

కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.86 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 77 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలో నమోదవుతుండగా.. ఆ తర్వాత పుణె, థానేలోనే నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.