దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 19,556 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం ...

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. భారత్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 301 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో 1,00,75,116 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1,46,111 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 10,72,228 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 96,36,487 మంది కోలుకున్నారు.
కాగా, దేశంలో కోవిడ్ పూర్తి స్థాయిలో కట్టడి రాకపోవడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో పలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. దేశంలో ప్రయోగదశలో ఉన్న పలు వ్యాక్సిన్లు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
తెలంగాణ కరోనా అప్‌డేట్స్: గడిచిన 24 గంటల్లో 617 పాజిటివ్ కేసులు నమోదు.. ముగ్గురు మృతి




