National Corona Updates: నేషనల్ కరోనా బులెటిన్ విడుల.. కోటి దాటిన రికవరీలు.. కొత్తగా 20వేల కేసులు నమోదు, 222 మంది మృతి..
National Corona Updates: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ..
National Corona Updates: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. రోజు రోజుకు వేల సంఖ్యలో జనాలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,346 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,95,278 మంది కరోనా బారిన పడ్డారు.
ఇదే సమయంలో ఒక్కరోజులో 19,587 మంది కరోనా నుండి కోలుకున్నారు. దాంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి (1,00,16,859) దాటింది. ఇక కరోనా కారణంగా బుధవారం సాయంత్రం నాటికి 222 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూసుకుంటే కరోనా మృతుల సంఖ్య 1,50,336కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 96.35 శాతం ఉండగా, డెత్ రేట్ 1. 45శాతం ఉంది.
Also read:
అమెరికా క్యాపిటల్ భవనంలో బాష్పవాయు ప్రయోగం, కాల్పుల్లో మహిళ సహా నలుగురి మృతి, అంతా భీభత్సం