Covid-19 Vaccine Dry Run: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రవాణాపై రాష్ట్ర మంత్రులతో హర్షవర్ధన్ సమీక్ష

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు టీకా కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎమర్జెన్సీ కేసుల్లో కోవిడ్ 19 చికిత్సకు ..

Covid-19 Vaccine Dry Run: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రవాణాపై రాష్ట్ర మంత్రులతో హర్షవర్ధన్  సమీక్ష
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2021 | 3:20 PM

Covid-19 Vaccine Dry Run: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు టీకా కోసం ఏడాది నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎమర్జెన్సీ కేసుల్లో కోవిడ్ 19 చికిత్స అందించడానికి కనుగొన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ టీకాల రవాణాకు మార్గం లభించింది. కోవిడ్ టీకాలను రవాణను ఈరోజు లేదా రేపటి నుంచి ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. పుణె కేంద్రంగా దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాలను సరఫరా చేస్తామని… దీని కోసం దేశ వ్యాప్తంగా 41 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హర్షవర్షన్ కేంద్ర ప్రాంత , రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులతో సమీక్షను నిర్వహించారు.  ఆయారాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా తీవ్రత వంటి పలు అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా టీకాలను ప్రయాణీకుల విమానాల్లో తరలించనున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ కేరళ, మహారాష్ట్ర, ఛతీస్ గఢ్ ల్లో తిరిగి పెరుగుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర మంత్రులకు హర్ష వర్ధన్ సూచించారు. ఓ వైపు కరోనా మరోవైపు బర్ద్ ఫ్లూ కేసులు  వ్యాప్తిస్తుందని.. రాష్ట్రాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
రేపటి డ్రై రన్‌, టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంపై మరింత శ్రద్ధ వహించాలని.. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ టీకాల పనితీరుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు , అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వాలని కమిటీ సూచిందని తెలిపారు హర్షవర్ధన్.