రైతుల ఆందోళన కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీయవచ్చు, సుప్రీంకోర్టు ఆందోళన, మర్కజ్ కేసు ప్రస్తావన

ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఢిల్లీలోనూ ఇతర చోట్ల కరోనా వైరస్ మరింత ప్రబలం కావచ్ఛునని పేర్కొంది..

రైతుల ఆందోళన కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీయవచ్చు, సుప్రీంకోర్టు ఆందోళన, మర్కజ్ కేసు ప్రస్తావన
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2021 | 2:59 PM

Farmers Protest:ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఢిల్లీలోనూ ఇతర చోట్ల కరోనా వైరస్ మరింత ప్రబలం కావచ్ఛునని పేర్కొంది.  ఈ సందర్భంగా గతంలో ఈ నగరంలో మర్కజ్ కేసును గుర్తు చేస్తూ.. కేంద్రం దీనిపై సమాధానమివ్వాలని సూచించింది. (ఢిల్లీ నగరంలో గత ఏడాది మార్చిలో మర్కజ్ లో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న వారి కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. పెద్ద సంఖ్యలో విదేశీ యాత్రికులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు).  ఇక అన్నదాతల ఆందోళన ముగియాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితిపై తాము ఆందోళన చెందుతున్నామని సీజేఐ జస్టిస్ ఎస్ఎ,బాబ్డే   అన్నారు. ఇది ప్రబలం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపి సమస్య సానుకూలమయ్యేలా చూడాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితిలో మార్పేమీ ఉన్నట్టు కనబడ్డంలేదని విచారం వ్యక్తం చేశారు.

కాగా-కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఉభయ పక్షాలూ కొంత అవగాహనకు వఛ్చిన దాఖలాలు కనబడుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..కోర్టుకు తెలిపారు.  కేంద్రంతో ఏడు దఫాలుగా రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Also Read:

Raja Singh Challenge: సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సవాల్.. ఐదు రోజులు గడువు ఇస్తున్నానంటూ..

Fishermen Clashes: మత్స్యకారుల మధ్య వివాదం.. స్పందించిన మంత్రి అప్పలరాజు.. గొడవలు సద్దుమణిగినట్లేనని ప్రకటన..

BJP ‘Chalo Ramatheertham’ Live Updates : నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద హైటెన్షన్..