అమెరికా క్యాపిటల్ భవనంలో బాష్పవాయు ప్రయోగం, కాల్పుల్లో మహిళ సహా నలుగురి మృతి, అంతా బీభత్సం

అమెరికా క్యాపిటల్ భవనంలో చేరిన వేలాది  ట్రంప్ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. 

అమెరికా క్యాపిటల్ భవనంలో బాష్పవాయు ప్రయోగం, కాల్పుల్లో మహిళ సహా నలుగురి మృతి, అంతా బీభత్సం
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Jan 07, 2021 | 12:51 PM

అమెరికా క్యాపిటల్ భవనంలో చేరిన వేలాది  ట్రంప్ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు.  వారు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ సహా నలుగురు మరణించారు. ఆమెను శాన్ డీగోకు చెందిన అశ్లి బాబిట్ గా గుర్తించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె ఆ తరువాత మృతి చెందింది. ట్రంప్ కి గట్టి మద్దతుదారైన ఈమె ఎయిర్ ఫోర్స్ లో సుమారు 14 ఏళ్ళు పని చేసింది. అటు కేపిటల్ గ్రౌండ్స్ సమీపంలో రెండు పైప్ బాంబులను పోలీసులు కనుగొన్నారు. అలాగే పెద్ద గన్స్, మోలో తొవ్ కాక్ టైల్స్ తో  కూడిన భారీ ట్రక్కును కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు యుఎస్ కాంగ్రెస్ బుధవారం సమావేశమైంది. ఇక ఇదే అదనని ట్రంప్ మద్దతుదారులు దాన్ని అడ్డుకునేందుకు రెచ్చిపోయారు.ట్రంప్ మద్దతుదారులు పోలీసులమీద కూడా దాడులు చేయడంతో డజన్ల మంది పోలీసులు గాయపడ్డారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర ప్రముఖులను సెక్యూరిటీ దళాలు సురక్షితంగా బయటకి పంపాయి.  క్యాపిటల్ కు మార్చ్ నిర్వహించాలని తన సపోర్టర్లకు పిలుపునిచ్చిన అనంతరం ట్రంప్.. వారిని తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరారు. కాగా కర్ఫ్యూను ఉల్లంఘించిన 30 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.ఇక వాషింగ్టన్ లో పబ్లిక్ ఎమర్జెన్సీని 15 రోజులపాటు పొడిగించారు. ఈ విషయాన్నీ మేయర్ మురియల్ బౌసర్ ప్రకటించారు. ఇలా ఉండగా.. ట్రంప్ ని ఈ నెల 20 కి ముందే బర్తరఫ్ చేయాలంటూ కొంతమంది ఎంపీలు కేకలు పెట్టారు.మరోవైపు ఆరిజోనాలో బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన దావాను సెనేట్ తోసిపుచ్చింది. రిపబ్లికన్ల అభ్యంతరాలను 93 మంది సెనేటర్లు తోసిపుచ్చగా ఆరుగురు మాత్రం దీనికి అనుకూలంగా ఓటు చేశారు. అటు=బైడెన్ ఎన్నికకు సంబంధించిన  సర్టిఫికేషన్ ని అమెరికా తోసిపుచ్ఛే ప్రసక్తిలేదని నాన్సీ పెలోసీ ప్రకటించారు. ట్రంప్ మద్దతుదారులది సిగ్గుచేటైన చర్య అని, కానీ ఇలాంటివాటికి మేము వెనుకంజ వేసే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. . వీ విల్ బీ పార్ట్ ఆఫ్ హిస్టరీ.. దట్ షోస్ ది వరల్డ్ వాట్ అమెరికా ఈజ్ మేడ్ ఆఫ్ అని ఆమె వ్యాఖ్యానించారు.

Read Also:Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లిన ట్రంప్‌ మద్దతు దారులు.. గన్‌తో కాల్పులు

Latest Articles