Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లిన ట్రంప్‌ మద్దతు దారులు.. గన్‌తో కాల్పులు

Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాపిటల్‌ భవనంలో బుధవారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి....

Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లిన ట్రంప్‌ మద్దతు దారులు.. గన్‌తో కాల్పులు
Follow us

|

Updated on: Jan 07, 2021 | 3:49 AM

Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.  భవనంలో బుధవారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధృవీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారుల నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్కసారిగా ట్రంప్‌ మద్దతు దారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకువచ్చారు.

దీంతో బైడెన్‌ ధృవీకరణకు ఆటంకం ఏర్పడింది. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.  ట్రంప్‌ ఆదేశాలతో కేంద్ర బలగాలను రంగంలోకి దించినట్లు వైట్‌ హౌస్‌ తెలిపింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్‌ భవనం విడిచి వెళ్లాలని అన్నారు. అలాగే ఈ ఘటనపై నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ స్పందించారు. ఈ చర్యను ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను, రాజ్యాంగాన్ని కాపాడడానికి ట్రంప్‌ వెంటనే జాతీయ ఛానల్‌లో ప్రకటన చేయాలని ట్వీట్‌ చేశారు. మరో వైపు వాషింగ్టన్‌ మేయర్‌ బౌజర్‌ నగరంలో కర్ఫ్యూ విధించారు. కేంద్ర బలగాలు క్యాపిటల్‌ భవనాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి.

Latest Articles
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో