తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.6 కోట్లు విరాళమిచ్చిన మై హోమ్ ఇండస్ట్రీస్

తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.6 కోట్లు విరాళమిచ్చిన మై హోమ్ ఇండస్ట్రీస్

అలాగే 'కోవిడ్‌-19' నివారణలో భాగంగా సహాయచర్యల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిల సహాయనిధికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించింది మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌. ఇందులో భాగంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 7:36 PM

కరోనాను ఎదుర్కోవడాన్ని.. ప్రపంచ దేశాలు సవాలుగా తీసుకుని పోరాటం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించాయి. అయినప్పటికీ ఈ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతక వ్యాధి కావడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వీరికి అండగా, ప్రజల రక్షణకై పలు కంపెనీలు, ప్రముఖులు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు.

అలాగే కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తన వంతు సాయంగా మూడు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది మై హోమ్‌ సంస్థ. అందుకు సంబంధించిన చెక్‌ను మై హోమ్‌ సిమెంట్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి రంజిత్‌రావు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అందచేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మైహోమ్‌ గ్రూప్‌ మూడు కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అందుకు సంబంధించిన చెక్‌ను అందించారు మైహోమ్‌ గ్రూప్‌ సంస్థ డైరెక్టర్లు జూపల్లి రాము రావు, జూపల్లి శ్యామ్‌రావు. అంతేగాక కరోనా వైరస్ నివారణా చర్యలో భాగంగా  తెలంగాణ పోలీసు సిబ్బందికి 28 వేల బాటిల్స్ హోమియోపతి మందులను, దాదాపు 10 వేల మంది కార్మికలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి:

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

కరోనా వ్యాప్తి: కరెన్సీ వద్దు.. డిజిటల్ చెల్లింపులే చేయండి..

కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu