కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి

కరోనా ఇంపాక్ట్‌కి ఇటలీలో వంద మంది వైద్యులు మృతి చెందారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఆ దేశంలో వేల మంది మరణించగా.. అందులో వంద మంది వైద్యులే ఉన్నారని ఆ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అంతేకుండా మరో 30 మంది నర్సులు కూడా మృతి చెందినట్లు..

కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 3:30 PM

కరోనా ఇంపాక్ట్‌కి ఇటలీలో వంద మంది వైద్యులు మృతి చెందారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఆ దేశంలో వేల మంది మరణించగా.. అందులో వంద మంది వైద్యులే ఉన్నారని ఆ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అంతేకుండా మరో 30 మంది నర్సులు కూడా మృతి చెందినట్లు తెలిపారు. ఇటలీలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిలో 10 శాతం మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇటలీలో కోవిడ్ అదుపులో ఉందంటున్నారు అధికారులు. మార్చి 9న ఇటలీలో లాక్‌డౌన్ ప్రకటించిన ఆ దేశం ఫుడ్ మార్కెట్స్, మందులు తప్ప అన్నీ మూసేసింది. రూల్స్ అతిక్రమించిన వారికి మూడు నెలల జైలు, భారీ ఫైన్‌లు వేస్తోంది. కాగా ఏప్రిల్ 13వ తేదీతో ఇటలీలో లాక్‌డౌన్ ముగియబోతుంది. మరి ఆ తర్వాత దీన్ని కొనసాగిస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం