Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు. మిగతా ప్రాంతాల్లో దశలవారిగా ఆంక్షల తొలగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు సమయం రాత్రి 9.00 నుంచి ఉదయం గం. 5.00 వరకు
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో నిన్నటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు. కెవియట్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సికింద్రాబాద్ ప్రజలకు, ప్రధాని మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. 200కు పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచంలో ఏదేశంతో పోల్చి చూసినా భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అభినందిస్తున్నాయి. ఏ కొలమానంతో పోల్చి చూసినా భారత్ అత్యంత మెరుగ్గా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • అవుటర్ టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత. కరోనా నేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత అంటున్న హెచ్ ఎం డి ఏ. ఓ ఆర్ ఆర్ పై రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ యూజర్స్. నిత్యం ప్రయాణించే లక్షా 30 వేల వాహనాల్లో 60 వేలు ఫాస్టాగ్​ యూజర్స్​ . 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి అమలులోనికి వచ్చిన ఫాస్టాగ్​ నిబంధనలు . ఫాస్టాగ్​ లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలంటున్న హెచ్​ఎండిఏ.
  • వందేభారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుండి మాస్కోకు వెళుతున్న ఎయిర్ ఇండియా (AI-1945) పైలెట్ కి కరోనా పాజిటివ్. కరోనా పాజిటివ్ రావడం తో ఫ్లైట్ వెనక్కి తిరిగి వస్తుందని అధికారులు వెల్లడి.

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో..
Actor Narsingh Yadav admitted in Hospital, బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు నర్సింగ్‌ యాదవ్‌. కాగా ఈ సందర్భంగా.. నటుడు నర్సింగ్ యాదవ్ భార్య మాట్లాడుతూ.. నా భర్త సాయంత్రం 4 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. దీంతో వెంటనే మేము సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము. అనుకోకుండా కోమాలోకి వెళ్ళారు. 48 గంటల పాటు డాక్టర్లు అబ్జర్ వేషన్‌లో ఉంచాలన్నారు. ఇంకా వెంటిలేటర్‌ పైనే చికిత్స కొనసాగుతుంది.

కాగా ఇంట్లో కింద పడిపోయాడని.. తలకి గాయం అయ్యిందని.. వస్తున్న వార్తలు అవాస్తవం. తను ఎక్కడా పడిపోలేదు. ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయారు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండని ఆమె అన్నారు.

మైలా నర‌సింహ యాద‌వ్‌ని.. ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర‌సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌ భాషల్లో న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన భాషాలోనూ మంచి క్యారెక్టర్ చేశారు.

అలాగే విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన ‘హేమాహేమీలు’తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమయ్యారు. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌ జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన క్యారెక్టర్లకు చాలా మంచి పేరు వ‌చ్చింది.

ఇటీవ‌ల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెంబ‌ర్ 150’లోనూ న‌టించారు. గ‌త కొంత‌కాలంగా ఆయన డ‌యాలిసిస్ చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు వున్నట్టుండి కోమాలోకి వెళ్లారు నర్సింగ్ యాదవ్. వెంటనే ఆయన్ని య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించారు కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి:

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

 

Related Tags