Viral News: ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే కంటే..

అయితే ఎక్కువ రోజులు నచ్చని పనితో విసిగి చెందిన ఓ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పుణెకు చెందిన ఓ ఉద్యోగి పుణెలోని ఓ సంస్థలో సేల్స్ అసోయేట్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అతను ఉద్యోగం పట్ల అసహనంతో ఉన్నాడు. ఎలాంటి ఇంక్రిమెంట్స్‌ లేకపోవడం, కెరీర్‌లో గ్రోత్‌ లేకపోవడం, వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌...

Viral News: ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే కంటే..
Viral Video
Follow us

|

Updated on: Apr 26, 2024 | 10:56 AM

కుటుంబ పరిస్థితులు, ఆర్థిక కారణాలు కారణం ఏదైనా మనలో చాలా మంది నచ్చని ఉద్యోగం చేస్తుంటారు. మనసుకు నచ్చకపోయినా ఆర్థిక అవసరాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంతో కుస్తీ పడుతుంటారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఉద్యోగాన్ని మానేసి ప్రశాంతంగా నచ్చిన పని చేసుకోవాలని ఆశిస్తుంటారు.

అయితే ఎక్కువ రోజులు నచ్చని పనితో విసిగి చెందిన ఓ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పుణెకు చెందిన ఓ ఉద్యోగి పుణెలోని ఓ సంస్థలో సేల్స్ అసోయేట్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా అతను ఉద్యోగం పట్ల అసహనంతో ఉన్నాడు. ఎలాంటి ఇంక్రిమెంట్స్‌ లేకపోవడం, కెరీర్‌లో గ్రోత్‌ లేకపోవడం, వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ కాకపోవడం నిరుత్సాహపడ్డాడు. మూడేళ్లుగా పనిచేస్తున్న కంపెనీపై కోపంతో ఊగిపోయిన అతను ఎట్టకేలకు ఉద్యోగాన్ని మానేశాడు.

View this post on Instagram

A post shared by Anish Bhagat (@anishbhagatt)

అయితే దీనిని ఒక వేడుకలా నిర్వహించాడు. తన తోటి స్నేహితులతో కలిసి ఆఫీస్‌ ముందు డప్పు చప్పుళ్ల నడమ పండగ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆ వ్యక్తి.. మీలో చాలా మంది నాలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారని నేను భావిస్తున్నాను. పని ప్రదేశంలో ఈరోజుల్లో గౌరవం లేకపోవడం సర్వసాధారణంగా మారిపోయింది’ అంటూ తనలోని భావాలను రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన చాలా మంది తాము కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, కానీ అతనిలా మాత్రం చేసే ధైర్యం లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..