AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ తీపికబురు: నవంబర్ చివరిదాకా ఫ్రీ రేషన్..

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తీపి కబురునందించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం తరపున మరో ఐదు నెలల పాటు..

మోదీ తీపికబురు: నవంబర్ చివరిదాకా ఫ్రీ రేషన్..
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2020 | 4:42 PM

Share

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తీపి కబురునందించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం తరపున మరో ఐదు నెలల పాటు ఉచిత రేషన్ అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 నేటితో ముగుస్తున్న సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

అన్ లాక్ 1.0 తరువాత ప్రజలలో నిర్లక్ష్యం కనిపించిందన్నారు ప్రధాని మోదీ. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంలో జనం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. ఒక దేశ ప్రధాని మాస్క్ ధరించకుండా బయటకు రావడంతో ఆయన జరిమానా కట్టాల్సి వచ్చిందన్నారు. అన్ లాక్ 2.0లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో వన్ నేషన్- వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ నవంబర్ వరకూ 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో నిబంధనలు అమలు చేయాలన్నారు.

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,522 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,66,840కి చేరింది. 2,15,125 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,34,822 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో వైరస్ వల్ల 418 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 16,893 కి చేరింది. ఇటువంటి తరుణంలో రేపటితో అన్‌లాక్ 2.0 అమల్లోకి రానుంది. అయిన్నప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలకు కష్టాలు మాత్రం తప్పలేదు. కరోనా వ్యాప్తి కారణంగా చాలా మంది ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఉపాధి లేక, పూట గడవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకాన్నిమరో ఐదు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.

దేశంలో కరోనా కేసులు తగ్గకపోవడం, కేసులు మరింత పెరుగుతూ… చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దీంతో ఏప్రిల్, మే, జూన్‌లో ఇచ్చినట్లే మరో మూడు నెలలు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు ఇవ్వాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మిజోరం, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, అసోం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు.. ఉచిత బియ్యం, కందిపప్పు మరో మూడు నెలలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి. రాష్ట్రాల వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం..పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా… దాదాపు 8 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా నవంబర్ చివరిదాకా ఉచిత రేషన్ అందించనున్నట్లు ప్రకటించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.