ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. గుంటూరు జిల్లా పోలీస్ అధికారి కుమారుడు చైతన్య‌తో నిహారిక ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది నిహారిక. కాగా తనకు కాబోయే వరుణ్ణి సోషల్ మీడియా..

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 2:07 PM

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. గుంటూరు జిల్లా పోలీస్ అధికారి కుమారుడు చైతన్య‌తో నిహారిక ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది నిహారిక. కాగా తనకు కాబోయే వరుణ్ణి సోషల్ మీడియా వేదిక‌గా ‘నావాడు అంటూ’ ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం చేసింది నిహారిక. ఈరోజు నిశ్చితార్ధం కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన‌బోతుందని స‌మాచారం. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్ర‌మే ఆహ్వానం పంపించారు. కాగా నిహారిక‌ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటించిన విష‌యం తెలిసిందే.

గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య హైద‌రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వ‌ర్క్ చేస్తున్నాడు. చైత‌న్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్ప‌టి నుంచో అనుబంధం ఉంది. చిరంజీవి తండ్రి కొణిదెల వెంక‌ట‌రావు, చైత‌న్య తాత‌య్య గుణ వెంక‌ట‌ర‌త్నం స్నేహితులు.

Read More:

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని