అన్నవరం ఆలయంలో కోవిడ్ కలకలం.. దర్మనాలు నిలిపివేత
తాజాగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఆగష్టు 23 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థాన ఈవో త్రినాథరావు..
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదవుతూండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అందులోనూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు అధికారులు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఆగష్టు 23 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థాన ఈవో త్రినాథరావు తెలిపారు.
ఇటీవలే ఆలయంలోని 650 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు అధికారులు. అయితే ఈ నెల 11వ తేదీన మరో 250 మంది సిబ్బందికి కోవిడ్ టెస్టులు చేశారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహించబనున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు పేర్కొన్నారు.
Read More:
బిగ్‌బాస్ సీజన్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జరుగుతుందో?