ఆ మెడికల్‌ టీంపై దాడిచేసిన వారందర్నీ పట్టించింది “డ్రోన్‌”లేనట..

బుధవారం నాడు యూపీ మురదాబాద్‌లోని ఓ ప్రాంతంలో మెడికల్ టీంపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.కరోనా కేసుల సర్వే నిమిత్తం వెళ్లిన  వైద్య సిబ్బందిపై .. అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. కరోనా అనుమానితులను తీసుకెళ్లేందుకు.. ఓ అంబులెన్స్‌.. దానికి సెక్యూరిటీగా రెండు పోలీసుల వాహనాలు ఓ మురదాబాద్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా మూకదాడికి దిగారు స్థానికులు. ఈ ఘటనలో ఇద్దరు వైద్య సిబ్బంది గాయపడగా.. మరికొందరు పోలీసులు కూడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:54 pm, Thu, 16 April 20
ఆ మెడికల్‌ టీంపై దాడిచేసిన వారందర్నీ పట్టించింది "డ్రోన్‌"లేనట..

బుధవారం నాడు యూపీ మురదాబాద్‌లోని ఓ ప్రాంతంలో మెడికల్ టీంపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.కరోనా కేసుల సర్వే నిమిత్తం వెళ్లిన  వైద్య సిబ్బందిపై .. అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. కరోనా అనుమానితులను తీసుకెళ్లేందుకు.. ఓ అంబులెన్స్‌.. దానికి సెక్యూరిటీగా రెండు పోలీసుల వాహనాలు ఓ మురదాబాద్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా మూకదాడికి దిగారు స్థానికులు. ఈ ఘటనలో ఇద్దరు వైద్య సిబ్బంది గాయపడగా.. మరికొందరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మెడికల్ టీంపై దాడికి దిగిన 17 మందిని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.

అయితే వీరందరిని డ్రోన్‌ కెమెరాల సహాయంతోనే గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మెడికల్ టీంపై దాడిని సీఎం యోగీ సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులందరిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు.. నష్టపరిహారాన్ని కూడా నిందిత కుటుంబాల నుంచే వసూలు చేయాలని ఆలోచిస్తున్నారు. కాగా.. యూపీలో కూడా కరోనా మహమ్మారి క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఏడు వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.